శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి తలసాని

byసూర్య | Fri, May 13, 2022, 03:57 PM

వేసవి సెలవులలో ఉన్న విద్యార్ధుల కోసం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ ఎస్పి రోడ్ లోని గురుమూర్తి స్విమ్మింగ్ పూల్ లో వేసవి శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులలో విద్యార్ధులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా వేసవి శిభిరాలలో చేరి ఆసక్తి కలిగిన వివిధ క్రీడలలో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు. నెలరోజులపాటు నిర్వహించే ఈ శిభిరాలలో అనుభవజ్ఞులైన కోచ్ లతో విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM