![]() |
![]() |
byసూర్య | Fri, May 13, 2022, 02:58 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ షిరిడీ సాయినాథాశ్రమము వద్ద శిఖర కలశ మరియు యంత్ర ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. శిఖర కలశ, యంత్ర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రమణ మూర్తి, నాయకులు సుదర్శన్ రెడ్డి, మురళి యాదవ్, 18వ వార్డు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.