అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి

byసూర్య | Fri, May 13, 2022, 02:09 PM

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నందున శుక్రవారం సభాస్థలిని అక్కడి ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లో రేపు సాయంత్రం బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభ కోసం భారీ స్థాయిలో జనసమీకరణ కోసం బిజెపి కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో సభాస్థలి ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రితో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తదితరులు సభాస్థలిని పరిశీలించిన వారిలో ఉన్నారు.

Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM