వారికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

byసూర్య | Wed, Jan 19, 2022, 09:23 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్ 317పై స్టే ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. జీవో నంబర్ 317పై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఒకసారి ఇలాగే స్పందించింది. తాజాగా ఈరోజు కొత్త జిల్లాల ఉపాధ్యాయుల కేటాయింపులపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులను విధుల్లో చేర్చుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త జిల్లాలో ఉపాధ్యాయుల కేటాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM