నల్ల మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

byసూర్య | Wed, Jan 19, 2022, 08:09 AM

నల్లమిరియాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల మిరియాల్లో పెప్పరైన్‌, కాప్సేసిన్‌ అనే రసాయనాలు ఉంటాయి. మిరియాల్లో ఘాటైన వాసనకు ఇవే కారణం. ఈ పెప్పరైన్‌ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరుని చురుగ్గా ఉంచుతుంది. నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 15 మిరియపు గింజలు, 2 లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేడి నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతుంది. 4 మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి పుచ్చుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్యాటీలివర్‌ ని అదుపులో ఉంచుతాయి. మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మిరియాల్లోని పెప్పరైన్‌కి రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే అంతమొందించే శక్తి ఉందని తేలింది. నల్ల మిరియాలు పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తాయి. పొట్ట, పేగుల్లోని అదనపు గాలిని తొలగిస్తాయి. మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి రుచి మొగ్గలను ఉత్తేజితం చేయడం వల్ల జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది. భోజనంలో పావుచెంచా వాము, రెండు మూడు మిరియాలు, నెయ్యి, ఉప్పుతో కలిపి మొదటిముద్ద తింటే అజీర్ణం తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. కడుపులో మంట ఉన్నవారు మిరియాలను మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM