వరల్డ్ టూరిజం అవార్డును మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందచేసిన సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Jan 18, 2022, 07:49 PM

యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్ తొలిసారిగా నిర్వహించిన ప్రతిష్టాత్మక 'బెస్ట్ టూరిజం విలేజ్' పోటీల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచం పల్లి ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రావడంతో మన దేశం సిఫార్సు చేసిన మూడు గ్రామాల్లో భూదాన్ పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, టూరిజం శాఖ ఎండీ మనోహర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకేసీఆర్ చేతుల మీదుగా వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జారీ చేసిన అవార్డుతోపాటు గుర్తింపు పత్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు. టూరిజం అధికారులను సీఎం కేసీఆర్ కూడా అభినందించారు. 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM