శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల కు హాజరుకానున్న తమిళనాడు గవర్నర్

byసూర్య | Tue, Jan 18, 2022, 07:38 PM

శ్రీ చిన జీయర్ స్వామి తమిళనాడు గవర్నర్ కలిసి, రామానుజ ఉత్సవానికి ఆహ్వానించారు. వివరాల్లో కి వెళ్తే..  హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో ఉన్న దివ్య సాకేతంలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా దివ్య సాకేతంలో 16.5 మీటర్ల శ్రీరామానుజుల విగ్రహాన్ని (సమానత్వ విగ్రహం) ఆవిష్కరించనున్నారు.
మంగళవారం నాడు త్రిదండి చిన జీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్ వ్యవస్థాపకుడు రామేశ్వర్ రావు జూపల్లి తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని కలిసి వేడుకలకు ఆహ్వానం పలికారు. అయితే ఈ రామానుజాచార్యుల సహస్రాబ్ది స్మారకార్థం 216 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు, ఈ రూ. 1,000 కోట్ల ప్రాజెక్టు మొదటి దశలో విగ్రహం, పరిక్రమ మరియు ఆలయం ఉన్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పలువురు కేంద్రమంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.


Latest News
 

నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM
కాశీ పాదయాత్రకుడికి ఘన స్వాగతం పలికిన భక్తులు Sat, Apr 20, 2024, 12:52 PM
సంక్షేమ పథకాలే బిజెపిని గెలిపిస్తాయి Sat, Apr 20, 2024, 12:50 PM
గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM