ఫీజుల నియంత్రణ చట్టం దిశగా టీఎస్ అడుగులు

byసూర్య | Mon, Jan 17, 2022, 09:28 PM

తెలంగాణలో విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. తెలంగాణలో విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. అంతేకాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టం, ఇంగ్లీషు మీడియం అంశాలపై అధ్యయానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సబ్ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఇందులో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉంటారు. ఫీజుల నియంత్రణ, ఇంగ్లీషు మీడియం అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరిపి విధివిధానాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఈ సబ్ కమిటీకి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నేటి క్యాబినెట్ సమావేశంలో కొవిడ్ తీవ్రతపైనా చర్చించారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM