తెలంగాణ పోలీస్ పై...కరోనా పంజా

byసూర్య | Mon, Jan 17, 2022, 04:01 PM

దేశలో ఏ సమస్య వచ్చినా వాటిని నియంత్రించే దిశగా పోలీసు శాఖ పనిచేస్తుంది. తాజాగా కరోనా వైరస్ పోలీస్ శాఖ పై పంజా విసిరింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో పోలీసులపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పీఎస్ లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పోలీసులు ఎంతో కష్టించి పని చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వహించారు. అలాంటి పోలీసులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 500 మంది పోలీసులకు కరోనా సోకింది. హైదరాబాదులోని మూడు కమిషనరేట్లలో పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్లకు ఎక్కువ మంది రాకూడదని, కేవలం ఒక్కరు మాత్రమే రావాలని ఆంక్షలు విధించారు. హోమ్ గార్డ్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM