రోడ్లు, చెరువుల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

byసూర్య | Mon, Jan 17, 2022, 03:25 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి పరిధిలో ఫాక్స్ సాగర్ నాలా, కోల్ నాలా అభివృద్ధి పనులు మరియు స్మశానవాటికల అభివృద్ధి, పలు బస్తీలు, కాలనీల్లో దెబ్బతిన్న రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి, చెరువుల సుందరీకరణ వంటి పనులపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎస్.ఎన్.డి.పి. నిధులతో చేపడుతున్న ఫాక్స్ సాగర్ నాలా, కోల్ నాలా అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. వర్షాకాలానికి ముందే పనులన్నీ పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే విధంగా స్మశానవాటికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాలాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. చెరువుల సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్ లు, మురుగు నీరు చేరకుండా నాలాలు, మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణం తలపించేలా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, డిఈలు శిరీష, పాపమ్మ, రమేష్, ఇరిగేషన్ డిఈ నరేందర్, ఏఈ రామారావు, ఏఈలు సురేందర్ నాయక్, మల్లారెడ్డి, సంపత్, కళ్యాణ్, సతీష్, ఆశ పాల్గొన్నారు.


Latest News
 

కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM
సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ Fri, Mar 29, 2024, 12:07 PM
కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల Fri, Mar 29, 2024, 12:06 PM
న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా Fri, Mar 29, 2024, 12:04 PM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:03 PM