పండగ పూట… ప్రాణం తీసిన గాలిపటం మాంజా

byసూర్య | Mon, Jan 17, 2022, 10:47 AM

సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయం. పిల్లలతో సహా పెద్దలు కూడా పండగ సందర్భంగా సరదా పడి గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే సంక్రాంతి పండగ ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. చాలా కాలంగా గాలిపటాలకు వాడే మాంజా చాలా ప్రమాదకరమైందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో మాంజా చుట్టుకుని ఆకాశంలోని పక్షులు మృత్యువాతపడిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా మాంజా చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం మాత్రం గమనార్హం


వివరాల్లోకి వెళ్తే… తెలంగాణలోని మంచిర్యాల పట్టణంలో భీమయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైకుపై వెళ్తుండగా… గాలిపటం మాంజా గొంతుకు చుట్టుకుంది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న స్పీడ్ కారణంగా మాంజా గొంతులోకి లోతుగా చొచ్చుకుని వెళ్లడంతో 36 ఏళ్ల భీమయ్య అక్కడికక్కడే మరణించాడు. దీంతో భీమయ్య కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM