జైపాల్ రెడ్డి కి కాంగ్రెస్ ఘన నివాళి

byసూర్య | Sun, Jan 16, 2022, 08:59 PM

హస్తం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళ్లులర్పించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్‌లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. నెక్లెస్‌రోడ్‌లోని జైపాల్ రెడ్డి ఘాట్‌లో ఆయన చిత్రపటానికి పూలు చల్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనం ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడడంలో జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ తీసుకున్నారని గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. జైపాల్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఆశయాలు నెరవేరతాయని తెలిపారు. రాజకీయాలంటే పార్టీ ఫిరాయింపుల, కొనుగోళ్ళు, కాంట్రాక్ట్‌లు‌గా కేసీఆర్ చేశారని దుయ్యబట్టారు. జైపాల్ రెడ్డి స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని కామెంట్ చేశారు.. పీవీ, మర్రి చెన్నారెడ్డి సరసన నిలిచే నాయకులు జైపాల్ అని వ్యాఖ్యానించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడారు.. ఏ పార్టీలో ఉన్న అందరితో కలిసిమెలిసి జైపాల్ రెడ్డి పని చేశారని చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి లేకపోవడం దేశానికి చాలా లోటని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారన్నారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ఒక మహా నాయకుడు, దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించారన్నారు.. పార్లమెంట్‌లో జైపాల్ రెడ్డి మాట్లాడితే డిక్షనరీ చూసుకునే వారని వెల్లడించారు. కార్యక్రమంలో అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM