రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ

byసూర్య | Sun, Jan 16, 2022, 08:08 PM

కరోనా రోజురోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం రేపు జరగనున్నది. తెలంగాణ‌లో విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ మ‌రోసారి విజృంభిస్తోన్న నేప‌థ్యంలో తీసుకోవాల్సిన మ‌రిన్ని చ‌ర్య‌ల‌పై రేపు కేబినెట్ భేటీ కానుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి  కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుందని తెలిపింది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... కరోనా తదితర విషయాల మీద కేబినెట్ లో చర్చించనున్నారని వివ‌రించింది.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM