కనుమ సందర్భంగా అమాంతం పెరిగిపోయిన చికెన్ ధర.. ఎంతంటే?

byసూర్య | Sun, Jan 16, 2022, 04:30 PM

కనుమ సందర్భంగా చికెన్ ధర ను వ్యాపారాలు అమాంతం పెంచేశారు. రిటైల్ షాపుల్లో కిలో చికెన్ ధర 200 నుంచి 220 రూపాయలకు అమ్మకాలు చేశారు. భోగి, సంక్రాంతి పండగలు శుక్ర, శనివారాల్లో రావడంతో చాలా మంది నాన్ వెజ్ కు దూరంగానే ఉన్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండగ రోజున అత్యధిక శాతం నాన్ వెజ్ ప్రియులు చికెన్ కోసం ఎగబడతారు. ఆదివారం కనుమ రోజున ఉదయం 6గంటల నుంచే చికెన్ షాపులు కిటకిటలాడారు. అయితే చాలా మంది వినియోగ దారులు చికెన్ ధర చూసి షాక్ అయ్యారు. కేవలం శనివారం కిలో చికెన్ 220 రూపాయలు పలుకగా ఆదివారం నాటికి కిలో 250 రూపాయలకు పెంచేశారు. దీంతో చాలా మంది కొనుగోలు ఇదేం ఖర్మరా బాబూ అంటూ గొనుక్కుంటూనే చికెన్ కొనుగోలు చేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM