తెలంగాణ నేతలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్

byసూర్య | Sun, Jan 16, 2022, 03:33 PM

తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను బీజేపీ నేతల నుంచి నిర్మలా సీతారామన్ తెలుసుకున్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, ఐఐఎం, ఎన్‌ఐడీ, ఎన్‌ఐఎస్‌ఈఆర్‌ విద్యాసంస్థలు కేటాయించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారులపై తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల నేపథ్యంలో రానున్న బడ్జెట్ లో కేంద్రం నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి Tue, Apr 23, 2024, 12:33 PM
ఉపాధి హామీ పథకం టీఏ సస్పెండ్ Tue, Apr 23, 2024, 12:31 PM