గోల్డ్ ఐస్ క్రీం...చూడముచ్చటగా ఉందండోయ్
 

by Suryaa Desk |

గోల్డ్ ఐస్ క్రీం...వినడానికి కాస్త వింతంగా ఉన్నా ఇది నిజమే. ఒక్కసారిగా ఐస్ క్రిమ్ కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. ఆహా అనిపించే రుచి.. అందమైన రూపు కలిగిన ఈ ఐస్ క్రీమ్.. దాన్ని అందించే ఐస్ క్రీం పార్లర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఐస్ క్రీమ్ 500 రూపాయల దగ్గర నుంచి లభిస్తుంది. గత నాలుగేళ్లుగా ఈ ఐస్క్రీం ఇక్కడ అందిస్తున్నారు. మరోసారి సోషల్ మీడియాలో ఇదీ ట్రెండ్ గా మారింది. ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లలు ఎగిరి గంతేస్తారు. తెగ సంబర పడిపోతుంటారు. అందులో చాలా రకాల వేరియంట్స్ ఉన్నాయి. గోల్డ్ ఐస్ క్రీమ్ తెలుసా.. తయారీ విధానం.. ఎక్కడ దొరుకుతుందో లాంటి ప్రశ్నలు వెంటనే వస్తాయి. అయితే ఆ ఐస్ క్రిమ్ మన హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ధర మాత్రం సామన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. చిన్న పెద్ద అన్న వయస్సుతో తేడా లేకుండా ఎంతో ఇష్టపడేది ఐస్ క్రిమ్ కోసమే. ఇందులో ఎన్నో వెరైటీలు వస్తున్నాయి. వాటిలో కొత్తదనం కోసం చాలా మంద్రి ట్రై చేస్తున్నారు. కొందరు నెచరల్ ఫ్రూట్స్‌ను క్రీమ్ స్టోన్ తో జోడిస్తున్నారు. ట్రెండ్ మరింత ముందుకు వెళ్లింది.. తాజా ఐస్ క్రీమ్‌ను మరింత రిచ్‌గా మార్చేశారు. ఐస్ క్రీమ్ ను బంగారంతో మిక్స్ చేశారు. అవును ఇది నిజం.. ఇది ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్‌లో గోల్డ్ ప్లేట్స్ పేర్చిన ఐస్ క్రీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మీకు 24క్యార‌ట్ గోల్డ్ తో చేసిన ఐస్ క్రీమ్ గురించి మీకు తెలుసా. ఇంత‌కీ ఈ 24 క్యార‌ట్ గోల్డ్ ఐస్ క్రీమ్ ఎక్క‌డ దొరుకుతుంది. బంజారాహిల్స్ లో ఈ ఐస్ క్రీమ్స్ లభిస్తాయి. అది కూడా అందుబాటు ధ‌ర‌లోనే ఉంది. బంజారాహిల్స్ లోని ఐస్ క్రీమ్ పార్లర్ లో వందలాది రకాలైన ఐస్క్రీమ్లు లభిస్తాయి. ఈ పార్లర్ కి ప్రత్యేక తీసుకొచ్చింది మాత్రం మినీ మిడాస్ ఐస్ క్రిమ్. వివిధ ఫ్లేవర్ లలో రుచికరంగా ఐస్ క్రీమ్ తయారు చేసిన తర్వాత చివరకు 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ ను తీసుకొచ్చారు.


Latest News
పోలీస్ శాఖలో కరోనా కలకలం...! Tue, Jan 18, 2022, 01:02 PM
కేంద్రానికి మంత్రి హరీష్ రావు లేఖ Tue, Jan 18, 2022, 12:40 PM
ఆ విద్యార్థులకు శుభవార్త Tue, Jan 18, 2022, 12:01 PM
మైనర్లు పట్టుబడితే పై తల్లిదండ్రులకు జైలు శిక్ష Tue, Jan 18, 2022, 11:39 AM
అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య Tue, Jan 18, 2022, 11:11 AM