కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk |

కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన రాములు నాయక్ (32) గంభీరావుపేట మండలం రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. శుక్రవారం పండుగ సందర్భంగా మామను తీసుకురావడానికి రాములు నాయక్ మాచారెడ్డి నుంచి గంభీరావుపేటకు స్కూటీపై బయలుదేరాడు.గంభీరావుపేట సమీపంలోని పెద్దమ్మ సరిహద్దులో సిద్దిపేట డిపో నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు రాములు నాయక్ స్కూటీని ఢీకొట్టింది. రాము నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న గంభీరావుపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
పోలీస్ శాఖలో కరోనా కలకలం...! Tue, Jan 18, 2022, 01:02 PM
కేంద్రానికి మంత్రి హరీష్ రావు లేఖ Tue, Jan 18, 2022, 12:40 PM
ఆ విద్యార్థులకు శుభవార్త Tue, Jan 18, 2022, 12:01 PM
మైనర్లు పట్టుబడితే పై తల్లిదండ్రులకు జైలు శిక్ష Tue, Jan 18, 2022, 11:39 AM
అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య Tue, Jan 18, 2022, 11:11 AM