గాంధీకి పోటెత్తిన కరోనా బాధితులు
 

by Suryaa Desk |

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్‌ బాధితులు పోటెత్తుతున్నారు.ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. దీంతో ఆస్పత్రిలో బాధితుల సంఖ్య 111కు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులు కూడా ఉన్నారు.


కరోనా బాధితులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. ప్రధాన బిల్డింగ్‌లోని సెకండ్‌ ఫ్లోర్‌ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు.


 


 


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM