ఫ్రీ వైఫై వాడేవారికి హెచ్చరిక

byసూర్య | Fri, Jan 14, 2022, 12:14 PM

ఇటీవల కాలంలో ఫ్రీ వైఫై సేవలు పెరిగిపోతున్నాయి. బస్టాండ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ వద్ద కస్టమర్లకు ఆకర్షించేందుకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ ఫ్రీ వైఫైతో మొదటికే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఉచిత వైఫై వాడే యూజర్ల నుంచి సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో గత కొద్ది నెలలుగా ఇలాంటి మోసాలు పెరిగిపోయాయని తెలిపారు. ఫ్రీ వైఫై నెట్ వర్క్ లోకి సైబర్ నేరగాళ్లు సాధారణ వినియోగదారుల్లాగానే ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత మ్యాన్ ఇన్ మిడల్ అటాక్ పద్దతిలో దాడి చేస్తూ ఫోన్ నెంబర్లు, మెయిల్ అడ్రస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతా వివరాలు, పాస్ వర్డ్ లు సేకరిస్తున్నారని తెలిపారు. వాటి సాయంతో బ్యాంకులో ఉన్న నగదును బదిలీ చేసుకుంటున్నారని, మరికొన్ని సందర్భాల్లో సైబర్ నేరగాళ్లకు భయపడి బాధితులు నగదు బదిలీ చేస్తున్నారని పోలీసులు అలర్ట్ చేశారు.

Latest News
 

నారాయణఖేడ్ లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు Sat, May 21, 2022, 02:11 PM
పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: మండల విద్యాధికారి అంజయ్య Sat, May 21, 2022, 02:10 PM
సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన.. నేడు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ. Sat, May 21, 2022, 01:54 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత Sat, May 21, 2022, 01:30 PM
నేడు బేగంబజార్ బంద్ Sat, May 21, 2022, 01:25 PM