భారీగా నష్టపోయిన సూచీలు
 

by Suryaa Desk |

దేశీ స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ‍స్వల్ప కాలిక లాభాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెటల్‌, ఐటీ కంపెనీల షేర్ల దన్నుతో నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్‌ ఈ రోజు వెంటనే భారీగా పాయింట్లను కోల్పోతూ నష్టాలను చవి చూసింది.ఆ వెంటనే కనిష్ట ధరల దగ్గర మరోసారి కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్‌ నెమ్మదిగా కోలుకుంటోంది.ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సన్సెక్స్‌ 61,040 పాయింట్లతో ప్రారంభంమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,757 పాయింట్లకు పడిపోయి 400లకు పైగా పాయింట్లు కోల్పోయింది. అక్కడ కొనుగోలు దారుల మద్దతు లభించడంతో క్రమంగా పాయింట్లు పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 166 పాయింట్ల నష్టంతో 61,069 పాయింట్ల దగ్గర ఉంది. ఇక నిఫ్టీలో సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. 41 పాయింట్ల నష్టంతో 18,216 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.


Latest News
బంగారం కొనుగోలుదారుల‌కు శుభవార్త‌... Sat, Jan 29, 2022, 04:36 PM
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM