తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు

byసూర్య | Fri, Jan 14, 2022, 09:36 AM

తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. ఏపీ, తెలంగాణలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి.వాడవాడలా భోగిమంలు వేసి.. చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగిమంటలు వెలిగించి.. పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు ప్రజలు. భోగి మంటల్లో పాత సామాగ్రి వేసి అగ్ని దేవున్ని ప్రార్థిస్తున్నారు.భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నారు. వాడవాడలా చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. గంగిరెద్దుల ఆటపాటలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇటు బోర్డర్‌లో గస్తీ కాస్తున్న జవాన్‌లు కూడా సరిహద్దుల్లోనే భోగి మంటలు వెలిగించి డ్యాన్సులు చేశారు.


అయితే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు భోగి పండగకు దూరంగా ఉంటున్నారు. రసన్న పేట మండలంలోని బసివలస రెడ్డి పేట, చింతువాని పేట, గార మండలంలోని బూరవల్లి, కోటబొమ్మాళి మండలంలోని పెద్దబమ్మిడి గ్రామాల్లో మాత్రం భోగి సందడి కనిపించడం లేదు. తరతరాల నుంచి వస్తున్న గ్రామాల కట్టుబాట్ల కారణంగా భోగి మంటలు వేయటంలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.


 


బసివలస గ్రామంలో దశాబ్దాల క్రితం కొంతమంది విలువైన తాలపత్ర గ్రంథాలు, వైద్య శాస్త్ర రచనలు మంటల్లో వేసి తగలబెట్టారని.. అందుకే ఈ భోగిని చెడుగా భావించి పండగను జరపడం లేదంటున్నారు. భోగి మంటలు వేస్తే గ్రామాలకు అరిష్టమనే భయంతో.. ఈ వేడుకలు జరపడం లేదు స్థానికులు. అయితే మకర సంక్రాంతితో పాటు కనుమను జరుపుతామని అక్కడి ప్రజలు అంటున్నారు.


Latest News
 

పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మామూలే Fri, Dec 02, 2022, 12:17 AM
సంస్కర హీనంగా మాట్లాడుతున్న షర్మిల: బల్క సుమన్ Fri, Dec 02, 2022, 12:17 AM
ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదూ...కేసీఆర్ కు ఈటల రాజేందర్ హెచ్చరిక Fri, Dec 02, 2022, 12:16 AM
నాకేమైనా జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత: వై.ఎస్.షర్మిల Fri, Dec 02, 2022, 12:15 AM
అలా చేయడం టీఆర్ఎస్ సైన్యం ముందు చెల్లదు: కవితా Thu, Dec 01, 2022, 10:37 PM