బీజేపీవి అన్ని రైతు వ్యతిరేక విధానాలు

byసూర్య | Thu, Jan 13, 2022, 09:19 PM

కేంద్రంలో బిజేపి ప్రభుత్వం ఏర్పడిన ఏడూ సంవత్సరాల కాలం లో అన్నీ రైతు వ్యతిరేక విధానాలను తీసుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుల ఆదాయాన్నీ రెండింతలు చేస్తామన్న మోడీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు పెంచిందని మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేపట్టిన విధానాల వల్లనే తెలంగాణా లో రైతుల ఆదాయం పెరిగింది సుస్పష్టం అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్,పెట్రోల్ ధరల తో తెలంగాణా రైతు జేబుకు కుడా చిల్లు పడిందన్నారు.గడిచిన ఏడేండ్లలో భారత దేశ రైతుకు బిజెపి పాలనలో ఒరిగింది ఏమి లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. పైగా బిజెపి వైఖరి దొంగే దొంగా...దొంగా అన్న చందంగా మారిందని ఆయన ఎద్దేవాచేశారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి గా రైతు బాంధవ్యుడిగా రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిష్కరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తే సమాధానం చెప్పాల్సిన ప్రధానమంత్రి మోడీ మౌనంగా ఉండి రాష్ట్ర నాయకులతో ఊరకుక్కల్లా మోరిగిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలసింది ముమ్మాటికీ కేంద్రమే నని ఆయన చెప్పారు. గడిచిన ఏడేండ్ల లో బిజెపి వల్ల దేశ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు అన్నది యావత్ భారతదేశం ఇప్పటికే గుర్తించిందన్నారు. కొత్త ఉద్యోగాలు రాక పోగా ఉన్న ఉద్యోగాలు ఉసిపోయ్యాయన్నారు.


Latest News
 

నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM