బీజేపీ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
 

by Suryaa Desk |

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్ పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను టచ్ చేసి చూడండి. మా దమ్మేంటో చూపిస్తాం.. అంటూ సవాల్ విసిరారు. రైతుబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని ప్రశ్నించారు.రైతుబంధు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. కేసీఆర్ ను జైలులో పెడతామంటూ ఏడాది నుంచి మొరుగుతున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే విచారణ చేయండి అని అన్నారు. ఎవరు జైలుకు పోయారో గుర్తు చేసుకోవాలని చెప్పారు.అంతకముందు సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అంశంలో సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమన్నారు. బుధవారం (జనవరి12,2022) హైదరాబాద్ లో మురళీధరరావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అవినీతి చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పోటీలోనే లేదని చెప్పారు.


 


 


Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM