కేంద్రం స్కీమ్.. నేరుగా ఖాతాల్లోకి రూ.10 వేలు!
 

by Suryaa Desk |

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో 'పీఎం స్వనిధి స్కీమ్' కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ప్రభుత్వం ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి రూ.10 వేల వరకు ఆర్థిక చేయూత అందిస్తోంది. రుణం రూపంలో ఈ డబ్బులు లభిస్తాయి. తీసుకున్న మళ్లీ కట్టాల్సి ఉంటుంది. పీఎం స్వనిధి స్కీమ్ కింద రూ.10 వేల వరకు రుణం పొందొచ్చు. దీని కోసం ఎలాంటి తనఖా పెట్టాల్సిన పని లేదు. లోన్ కోసం అప్లై చేసుకున్న 24 గంటల్లోనే డబ్బులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా కావొచ్చు. వీధి వ్యాపారులు లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. కరోనా కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడానికి ఈ స్కీమ్‌ను తెచ్చారు. తీసుకున్న రుణాన్ని కరెక్ట్‌గా తిరిగి చెల్లిస్తే.. వడ్డీ రేటులో సబ్సిడీ కూడా లభిస్తుంది. స్ట్రీట్ ఫుడ్, గుడ్లు విక్రయించేవారు, ఫ్రూట్స్ సెల్లర్లు, కూరగాయలు అమ్మేవారు, బార్బర్ షాప్ వంటి వారు ఈ తరహా రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని ఈఎంఐలో కచ్చితంగా కట్టేస్తే.. వడ్డీ రేటులో 7 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. వడ్డీ రేటు సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాకే వచ్చి చేరతాయి. ఈ లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కచ్చితంగా కలిగి ఉండాలి. 2022 మార్చి వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని గమనించాలి.


Latest News
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM