మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Thu, Jan 13, 2022, 02:12 PM

భారతీయ జనతా పార్టీపై తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ను ఏ క్షణమైన జైల్లో పెడతారని నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాద స్పద వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. అయితే.. బండి సంజయ్‌ చేసిన ఆ వ్యాక్యలుకు తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్‌ ఇచ్చారు.బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బంద్ చేయాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారని ఓ రేంజ్‌ లో వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పిచ్చి కుక్కుల మాట్లాడుతున్నారు …జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌ తోనే సాధ్యమన్నారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు Thu, Sep 28, 2023, 08:55 PM
ఘనంగా ఖైరతాబాద్‌ గణేశుడు నిమజ్జనం Thu, Sep 28, 2023, 02:51 PM
నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ Thu, Sep 28, 2023, 01:53 PM
మార్చని ఇంటి నంబర్ లు. పెరిగిన ఓటర్ల సంఖ్య Thu, Sep 28, 2023, 01:52 PM