రెండు కేసుల్లో తుది తీర్పు..షాక్ లో శంకర్ రావు
 

by Suryaa Desk |

ఊహించని ఘటనలు కొన్ని మనల్ని షాక్ లోకి తీసుకెళ్తాయి. అలాంటి పరిస్థితినే మాజీ మంత్రి శంకర్ రావుకు ఎదురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.శంకర్‌రావుకు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో రెండింటిలో దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన ఆరోపణలపై 2015లో శంకర్‌రావుపై షాద్‌నగర్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. వీటిపై నిన్న విచారణ జరగ్గా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఓ కేసులో ఆయనకు ఊరట లభించింది. అయితే, భూ వివాదంలో బెదిరింపులు, మహిళను దూషించిన కేసులో మాత్రం శంకర్‌రావును కోర్టు దోషిగా తేల్చింది. మహిళను దూషించిన కేసులో రూ. 2,000, మరో కేసులో రూ. 1,500 జరిమానా విధించింది. కోర్టులోనే ఉన్న మాజీ మంత్రి తీర్పు వెలువడిన వెంటనే షాక్‌తో స్పృహ తప్పి పడిపోయారు.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM