గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ...

byసూర్య | Thu, Jan 13, 2022, 11:16 AM

 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా అనేది ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి.గాలిలో ఉండే విషపదార్థాలు., కాలుష్య కారకాలు, పొగ తాగే అలవాటు, కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా, ఉండాలంటే ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు క్లీన్ గా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది.


ఆరెంజ్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.


 


అలాగే ఆపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫము,శ్లేష్మం లేకుండా శుభ్రం అవుతాయి. ఉదయాన్నే కొన్ని పుదీనా ఆకులను తిన్నా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన లంగ్స్ కెపాసిటీ బాగా పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.


Latest News
 

నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM