మాకు కాంగ్రెస్ పోటీయే కాదు:మురళీధరరావు

byసూర్య | Wed, Jan 12, 2022, 11:26 PM

కాంగ్రెస్ పార్టీ తమకు పోటీయే కాదన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని మురళీధరరావు విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి ప్రజలు లేరని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని జోస్యం చెప్పారు. కనీసం ఆపార్టీ జాతీయ అధ్యక్షుడని కూడా నియమించుకునే పరిస్థితిలో లేదన్నారు. అంతర్గత కుమ్ములాటలో వారి సమస్యలు తీర్చుకోవడానికే సమయం సరిపోవ‌డం లేదు. ఇక ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పంచాయితీలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆపార్టీ నేతలు అమోమయంలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు మురళీధరరావు. కేసీఆర్ వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఆయన అవినీతిని కక్కిస్తామన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపడం పక్కా అని హెచ్చరించారు. అవినీతి చేసిన వారు ఎంతటి వారైనా జెలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎగిరెగిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఢీ కొట్టేది బీజేపీయేనని స్పష్టం చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా ఉందన్నారు మురళీధరరావు. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించారు. ప్రధాని భద్రతపై పంజాబ్ సీఎం, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. భారత ప్రధాని భద్రత అత్యంత ప్రధానమైనది. ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్ ఎందుకు స్వాగతం పలకలేదని మురళీధరరావు ప్రశ్నించారు. భద్రతపై సమాధానం చెప్పకుండా బీజేపీ బహిరంగ సభ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందని మండిపడ్డారు.


Latest News
 

రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు Sat, Sep 24, 2022, 11:36 PM
ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం Sat, Sep 24, 2022, 10:30 PM
అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం Sat, Sep 24, 2022, 10:26 PM
మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ ఇన్ ఛార్జులు వీరే.. Sat, Sep 24, 2022, 09:40 PM
ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు Sat, Sep 24, 2022, 08:33 PM