పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ రెండు లక్షల బీమా
 

by Suryaa Desk |

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాను అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో 30 లక్షల పార్టీ సభ్యత్వాలను చేయించి తీరుతామని  అన్నారు. సభ్యత్వాలను చేయించడానికి జనవరి 26 వరకు గడువు పెట్టుకున్నామని. అయితే కరోనా నేపథ్యంలో గడువును పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు 7 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రతి బూత్ నుంచి 100 మంది సభ్యత్వాలను నమోదు చేయించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాను అందిస్తామని చెప్పారు. దీని కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ప్రమాదంలో మరణం సంభవిస్తే రూ. 2 లక్షల పరిహారం అందుతుందని, గాయపడితే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం లభిస్తుందని చెప్పారు. మండల స్థాయిలో 10 వేలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 50 వేలు, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 3.5 లక్షల సభ్యత్వాలను చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తామని తెలిపారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM