మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్

byసూర్య | Wed, Jan 12, 2022, 07:19 PM

సీఎం కేసీఆర్ రైతులను ఉద్దేశించి సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నరు అని సమాచారం. రైతులకు పింఛన్ ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో సీఎం కొత్త ప్రణాళికను ప్రకటించనున్నారు. రైతుల పింఛను సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రైతులకు రూ.2వేలు ఇచ్చే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్న కారు రైతులకు పింఛన్‌ ఇవ్వాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు.
ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు “రైతుబంధు” ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంతో రాష్ట్రంలో చాలా వరకు రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ఏడాదికి రెండుసార్లు వానాకాలం, యాసంగి పంటల సమయంలో రైతుబంధు అందజేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుబంధు ద్వారా 64 లక్షల మంది రైతులకు నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు అందించారు.
రైతులు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమాను ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రూ.3,205 కోట్ల ప్రీమియం చెల్లించారు.  ‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై రూ.2.71 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకునేందుకు రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేశారు. దీనివల్ల దాదాపు లక్ష మంది రైతులు లబ్ధి పొందారు.


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM