‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచుకోవడం.. దాచుకోవడమే

byసూర్య | Wed, Jan 12, 2022, 06:07 PM

‘‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచుకోవడం.. దాచుకోవడమే కేసీఆర్ ఎజెండా. కేసీఆర్ ఎక్కడున్నా లాక్కొస్తాం. ఫాం హౌస్ లో వెళ్లి పడుకునే నేత దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారు?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి  సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, సీఎం ఎప్పుడైనా జైలుకు పోవచ్చునని సంజయ్ అన్నారు. జైలుకు పంపితే సానుభూతి పొందాలన్న ఉద్దేశంతోనే వామపక్షాలు, ఇతర పార్టీల నేతలను ఆయన కలుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా కేంద్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇవాళ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోను, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైనా వివేకానందుడి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. పార్టీ ఆఫీసులో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కార్డియాక్ మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను మొదలుపెట్టిందన్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM