సినిమా థియేటర్ల విషయం పై ఏపీ మంత్రులతో నేను మాట్లాడతా: మంత్రి తలసాని
 

by Suryaa Desk |

సినిమా థియేటర్ల విషయం పై ఏపీ మంత్రులతో నేను మాట్లాడుతానని  మంత్రి తలసాని తెలిపారు. ప్రస్తుతం అఖండ, పుష్ప చిత్రాలతో చిత్ర పరిశ్రమ దూసుకుపోతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచి.. ఐదో ఆటకు అనుమతి ఇచ్చారు. ఏపీలో థియేటర్ల సమస్యపై రాష్ట్ర మంత్రులతో మాట్లాడతామన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తలసాని అన్నారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కుల, మతాలకు సంబంధించిన అంశాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమా పరిశ్రమలోని సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సత్వరమే స్పందిస్తుందని తలసాని అన్నారు. హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారు. తెలంగాణలో సినీ పరిశ్రమపై ప్రభుత్వం బలవంతపు నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తలసాని అన్నారు.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM