నేడు భారీగా తగ్గిన వెండి ధర.. ఎంతంటే?

byసూర్య | Wed, Jan 12, 2022, 05:38 PM

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఔన్సు బంగారం ధర రూ.228 పెరిగి రూ.46,812కి చేరుకుంది. అంతకుముందు రోజు బంగారం ధర రూ.46,584 వద్ద ఉంది.  దేశవ్యాప్తంగా విలువైన లోహాల ధరలు రాత్రిపూట పెరగడం దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.271 పెరిగి రూ.59,932కి చేరుకుంది. క్రితం రోజు కిలో వెండి ధర రూ.59,661 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,818 డాలర్లు, వెండి ఔన్సు ధర 22.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం 24 క్యారెట్ల బంగారం రూ.120 పెరిగి.. దాంతో రూ.48,760 నుంచి రూ.48,880కి చేరింది.
ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దాంతో మంగళవారం రూ.44,700 ఉన్న ధర నేడు రూ.44,800కి చేరింది. వెండి మాత్రం హైదరాబాద్‌లో భారీగా తగ్గింది. మంగళవారం కిలో రూ.64,600 ఉన్న వెండి నేడు రూ.3,600 తగ్గి రూ.61,000కి చేరుకుంది.


Latest News
 

హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్ Mon, Oct 03, 2022, 12:01 AM
తెలంగాణ కరోనా అప్డేట్ Sun, Oct 02, 2022, 10:28 PM
టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM