కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్
 

by Suryaa Desk |

317 జీవోలను రద్దు చేయాలంటూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద  సమ్మెకు దిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలుమూరు వెంకట్‌ను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. అయినప్పటికీ పోలీస్ స్టేషన్ లోనే వారు దీక్ష కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో అసంబద్ధంగా ఉందని, రాష్ట్ర ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఈ జీవో వల్ల ఉద్యోగులు మానసికoగ ఇబ్బంది పడుతున్నారు అని, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం దిగిరావడం లేదన్నారు. 317 జీవో రద్దు చేయాలని, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీతక్క డిమాండ్ చేస్తున్నారు.


Latest News
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM
పురుగుల మందు తాగి మైనర్ బాలిక మృతి...! Sat, Jan 29, 2022, 01:34 PM