గురుకుల విద్యార్థులకు ప్రోత్సాహాక బహుమతులు అందచేసిన మంత్రి కొప్పుల

byసూర్య | Wed, Jan 12, 2022, 05:22 PM

ఎస్సి గురుకుల విద్యార్థులకు ప్రోత్సాహాక బహుమతులు మంత్రి కొప్పుల అందచేశారు. అన్ని వర్గాల ప్రజలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దఎత్తున గురుకులాలను ప్రారంభించారన్నారు. ఎస్సీ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్, బీడీఎస్, ఐఐటీ, ఎన్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి 100 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, చెక్కులను పంపిణీ చేశారు.
2018-19,2019-20 విద్యా సంవత్సరాల్లో ఐఐటీ, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో సీట్లు పొందిన వారికి రూ.50వేలు, ఎన్‌ఐటీ, బీడీఎస్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.40వేలు చొప్పున చెక్కులను మంత్రి అందజేశారు. ఐఐటీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.92 లక్షల 40 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉన్నత విద్యతోపాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దఎత్తున గురుకులాలను ప్రారంభించారని మంత్రి తెలిపారు. తెలంగాణ గురుకుల విద్యార్థులు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఫలితాలతోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని మంత్రి వివరించారు.


Latest News
 

నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు Fri, Mar 29, 2024, 11:00 AM
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM
యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి...! Fri, Mar 29, 2024, 10:26 AM