పెర్ఫ్యూమ్స్‌ను వాడుతున్నారా..?

byసూర్య | Wed, Jan 12, 2022, 03:30 PM

పది మందిలోకి వెళ్లినప్పుడు.. ఏదన్న ఫంక్షన్లకు వెళ్లినప్పుడు.. సెంట్లు వేసుకుంటున్నారా..? మంచి సువాసనల కోసం పెర్ఫ్యూమ్స్‌ను వాడుతున్నారా..? అయితే కొంచెం జాగ్రత్త. వాటి వల్ల రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంట. వీటి వల్ల మానసికంగా, శారీరకంగా కూడా హానీ జరుగుతుందని నిపుణులు అంటున్నారు. సెంట్‌, పెర్ఫ్యూమ్స్‌‌లో రసాయనాలు వాడడం వల్ల అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. పెర్ఫ్యూమ్స్‌ వాడేవారిలో రెండు శాతం మంది విష ప్రభావాలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు వీటిని అధికంగా వాడడం వల్ల చర్మ సమస్యలు తప్పడం లేదు. కొందరికి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వల్ల గాయాలు కూడా అవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా సెంట్, పెర్ఫ్యూమ్స్ వాడడం వల్ల డిప్రెషన్ సమస్య పెరుగుతుంది. అది నానాటికీ ఎక్కువైపోతుందట. అందువల్ల వీలైనంత వరకూ సెంట్లు, పెర్ఫ్యూమ్స్‌కి దూరంగా ఉండడం మేలు అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ఆడవాళ్లు జాగ్రత్త పడాలి. మార్కెట్‌లోకి వచ్చే.. పెర్ఫ్యూమ్స్‌కు అట్రాక్ట్ అయి వాటిని ట్రై చేస్తుంటారు. సువాసన కోసం వాడడం వల్ల.. లాభంకంటే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది గనుక అమ్మాయిలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఇంట్లో వాళ్లను ఈ విషయంలో హెచ్చరించాలి.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM