ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోండిలా

byసూర్య | Wed, Jan 12, 2022, 01:58 PM

ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోవడంతో అనేక సమస్యలు వస్తాయి. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


-ఉదయాన్నే పరిగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. అలా చేస్తే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. నిమ్మరసానికి బదులుగా పైనాపిల్, క్రాన్‌బెర్రీ జ్యూస్‌ లను కూడా తీసుకోవచ్చు.


- పరిగడుపునే 1 లేదా 2 టీ స్పూన్ల అల్లం రసం తాగినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.


- ఉదయాన్నే 3 నుంచి 5 పుదీనా ఆకులను నమిలి తినాలి. అలా చేస్తే ఊపిరితిత్తులకు బలం కలుగుతుంది. అంతేకాకుండా శుభ్రంగా మారుతాయి.


- రోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులను శుభ్రంగా మార్చుకోవచ్చు.


- గోరు వెచ్చని నీటిలో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి అనంతరం వచ్చే ఆవిరిని పీల్చాలి. అలా చేస్తే ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.


- ఛాతిపై నిత్యం ఆముదాన్ని మర్దనా చేయాలి. అలా చేస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM