ఎరువుల ధ‌ర‌ల పెంపుపై కేసీఆర్ మండిపాటు
 

by Suryaa Desk |

దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై తన నిరసన వ్యక్తం చేస్తూ నేడు ప్రధానికి బహిరంగ లేఖ రాయనున్నారు.బిజెపి కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు.కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బిజెపి ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం పిలుపునిచ్చారు.


 


 


Latest News
బంగారం కొనుగోలుదారుల‌కు శుభవార్త‌... Sat, Jan 29, 2022, 04:36 PM
మొక్కలు నాటిన ఫెమినా మిస్ ఇండియా Sat, Jan 29, 2022, 04:14 PM
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM