సీఎం కెసిఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Wed, Jan 12, 2022, 12:56 PM

సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకునే విషయంలో కేంద్రం సీరియస్ గా ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.ఆల్రెడీ కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైందన్నారు. ఎప్పుడైనా కేసీఆర్ జైలుకు వెళ్లవచ్చన్నారు. ఈ విషయం కేసీఆర్ కు తెలిసిపోయిందని , అందుకే కమ్యూనిస్టులతో పాటు విపక్ష నేతలతో భేటీ అవుతున్నారని తెలిపారు. ‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు..దోచుకోవడం.. దాచుకోవడమే.. జైల్లో వేసుడే …కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారు. ఆయన ఎన్ని డ్రామాలు చేసిన కేంద్రం వదిలిపెట్టదు. ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్ళి ఏం చేస్తారు’ అని బండి విమర్శలు గుప్పించారు.


తొలుత స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ” ఫ్రీ కార్డియాక్ మెడికల్ క్యాంప్” ను బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లోని రహమత్ నగర్ రామాలయాన్ని దర్శించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశం Sun, Sep 25, 2022, 11:28 AM
బతుకమ్మ వేడుకల నేపథ్యం మీకోసం Sun, Sep 25, 2022, 10:42 AM
ముషీరాబాద్‌ డిగ్రీ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి Sun, Sep 25, 2022, 10:29 AM
రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు Sat, Sep 24, 2022, 11:36 PM
ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం Sat, Sep 24, 2022, 10:30 PM