కేంద్ర ప్రభుత్వం నుండి అద్భుతమైన స్కీమ్

byసూర్య | Wed, Jan 12, 2022, 12:49 PM

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. వాటిలో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఆ పెన్షన్ స్కీమ్స్ లో 'ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్' కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి ఏడాది రూ.లక్షకు పైగా పొందొచ్చు. ఈ స్కీమ్‌ కేవలం 60 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఏడాదికి పెన్షన్ రూపంలో రూ.1.11 లక్షలు పొందొచ్చు. ఈ పథకం 2023 మర్చి వరకు అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సీనియర్ సిటిజన్స్ కోసమే ప్రత్యేకంగా తీసుకువచ్చింది. 60 ఏళ్లకు పైబడిన వయసు వారు ఈ పథకంలో చేరొచ్చు. రూ.15 లక్షల వరకు ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 10 ఏళ్లు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని అందిస్తోంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయి. నెలకు కనీసం రూ.1000 పెన్షన్ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.9250 పొందొచ్చు. దీనికి రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏడాదికి రూ.1.11 లక్షలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ లో చేరడానికి పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ పాస్‌ బుక్ జిరాక్స్ వంటి డాక్యుమెంట్లు అందిస్తే సరిపోతుంది. 3 ఏళ్ల తర్వాత లోన్ కూడా తీసుకోవచ్చు.


Latest News
 

కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టిన ఎమ్మెల్యే Wed, May 25, 2022, 05:03 PM
నేటి బంగారం ధరలు Wed, May 25, 2022, 04:51 PM
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల Wed, May 25, 2022, 04:02 PM
తెలంగాణలో స్టాడ్లర్ రైల్ 1000 కోట్ల పెట్టుబడి Wed, May 25, 2022, 03:37 PM
ప్రధాని టూర్ కు మంత్రి తలసాని Wed, May 25, 2022, 03:35 PM