తెలంగాణలో మ‌రోసారి పెరిగిన కరోనా వ్యాప్తి
 

by Suryaa Desk |

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మరోసారి పెరిగింది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,920 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో 1825 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 95 కేసులు పెరిగాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 1,920 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బులెటిన్‌లో తెలిపారు. అలాగే ఇద్దరిని కరోనా కాటు వేసింది. ఈరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా 417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 16,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కానీ రోజురోజుకు కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గకపోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు విధించనుంది. ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది.


Latest News
పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా Fri, Jan 28, 2022, 09:32 PM
జగిత్యాల మెడికల్ కాలేజీ పనుల్లో కలెక్టర్ అసంతృప్తి Fri, Jan 28, 2022, 09:10 PM
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించoడి :ఎమ్మెల్యే కె.మాణిక్యా రావు Fri, Jan 28, 2022, 08:57 PM
'TSMDC' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ Fri, Jan 28, 2022, 08:47 PM
హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ Fri, Jan 28, 2022, 08:43 PM