ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా

byసూర్య | Wed, Jan 12, 2022, 11:52 AM

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఈ ఏడాది టాటా గ్రూప్ వ్యవహరించనుంది. చైనా మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థ వివో స్థానంలో టాటా స్పాన్సర్ గా వ్యవహరించనుంది. వివోకు 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం ఉన్నప్పటికీ ఓ ఏడాది ముందుగానే వైదొలిగింది. నిజానికి గల్వాన్‌ లోయలో భారత్‌, చైనాల మధ్య ఘర్షణ నేపథ్యంలో 2020లో వివో వైదొలగింది. ఆ ఏడాది డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 2021లో వివో స్పాన్సర్‌గా తిరిగొచ్చింది. మరో ఏడాది అవకాశం ఉన్నప్పటికీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వివో స్థానంలో టాటా గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ఒప్పందం విలువ ఎంత అనేది మాత్రం వెల్లడి కాలేదు. బీసీసీఐకి వివో సీజన్‌కు రూ.440 కోట్లు చెల్లించేది.

Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM