సంస్కృతికి ప్రతీకలు ముగ్గులు: ఎల్బీనగర్ ఎమ్మెల్యే

byసూర్య | Wed, Jan 12, 2022, 10:13 AM

సంస్కృతి, సాంప్రదాయాలకు మహి ళలు వేసే రంగురంగుల ముగ్గులు ప్రతీకలుగా నిలుస్తాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కొత్తపేట డివిజన్ పరిధిలోని ప్రజయ్ నివాస్ ఫేస్-2లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకు ముందు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న కాలునీవాసులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 50 మంది మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. కాగా కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి చేసిన 'రైతు బంధు పథకం ముగ్గు పలువురిని విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులపై ఎంతో అభిమానం ఉందని తెలిపారు. వ్యవసాయం కోసం రైతులకు పెట్టుబడి సాయం అందించేం దుకు దేశంలో ఎక్కడలేని విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు పథకం అని తెలిపారు. కొన్ని సమస్యలను కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తెలియకారని వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరే టర్ వజీర్ ప్రకాశ్ గౌట్, శరీస్, తిరుమల్, సత్యనా రాయణ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించండి Wed, Apr 24, 2024, 12:26 PM
కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు Wed, Apr 24, 2024, 12:22 PM
డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ Wed, Apr 24, 2024, 12:21 PM
పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM