రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ : బోయినపల్లి వినోద్ కుమార్
 

by Suryaa Desk |

రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు తెలంగాణపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజ మెత్తారు.తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు, వికలాంగ పింఛన్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.


ఓర్వలేక, అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, తదితర పథకాలు మీ రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై నీతి ఆయోగ్ భేష్ అని ప్రకటించిందని వెల్లడించారు. బీజేపీ సీఎంలు తెలంగాణకు టూరిస్టుల్లాగా వచ్చి విమర్శ చేయడం తగదన్నారు.


 


 


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM