కారం తిన‌డం వ‌ల్ల కలిగే లాభాలివే

byసూర్య | Tue, Jan 11, 2022, 01:24 PM

మనం అనేక ర‌కాల కూర‌ల్లో కారం వేస్తుంటాం. కొందరు ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను వేస్తే.. మ‌రికొంద‌రు ఎండుకారం వేస్తుంటారు. అయితే కారంలో మ‌న శరీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజ‌నాలు ఉన్నాయి. కారం తిన‌డం వ‌ల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- ఎండు మిర‌ప‌కాయ‌ల పొడి (కారం)లో ఉండే ప‌లు ర‌కాల స‌మ్మేళ‌నాలు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా పరిశోధ‌న‌ల్లో వెల్లడైంది.


- మిర‌ప‌కాయ‌ల్లో ఉండే క్యాప్సెయిసిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డుతుంది. అంతేకాకుండా వాపుల‌ను తగ్గిస్తుంది.


- అల్సర్లు ఉన్నవారు కారం ఎక్కువ‌గా తినకూడదని చెబుతుంటారు. కానీ సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్రకారం.. కారంలో ఉండే ప‌లు స‌మ్మేళ‌నాలు జీర్ణ సమస్యలను పోగొడ‌తాయ‌ని తేలింది.


- కారం తిన‌డం వ‌ల్ల ర‌క్త ప్రసరణ మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి.


- కారం తింటే త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


- ద‌గ్గు, జ‌లుబు ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా స‌మస్యల నుంచి ఉప‌శమ‌నం ల‌భిస్తుంది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM