అభయాంజనేయ స్వామి నవగ్రహ యంత్ర బింబ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సురభీ వాణి దేవి
 

by Suryaa Desk |

మల్లంపేట్ లో అభయాంజనేయ స్వామి దేవాలయ జీవద్వజ నవగ్రహ యంత్ర బింబ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ శిఖర జీవద్వజ నవగ్రహ యంత్ర బింబ ప్రతిష్ఠా మహా కుంభాభిషేక మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్సీలు సురభీ వాణి దేవి గారు, శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో స్వామి వారిని వారు దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దైవ చింతనతో  మానసిక ప్రశాంతత దొరుకుతుందని అన్నారు. ఆలయాల అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సుంకరి కృష్ణ వేణి కృష్ణ, నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, లక్ష్మీ ఆంజనేయులు, సంధ్య హనుమంత్ రావు, మాదస్ వెంకటేష్, అర్కల అనంత స్వామి, జక్కుల కృష్ణా యాదవ్, మాజీ ఉప సర్పంచ్ అమర్నాథ్, జి.రమేష్, జి.నర్సింహా,యు.లక్ష్మణ్, కోటేశ్ తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం Tue, Dec 07, 2021, 09:33 PM
మంచిర్యాలలో గిరిజనులకు 200 దుప్పట్లు పంపిణీ చేసిన పోలీసులు Tue, Dec 07, 2021, 09:27 PM
టీఆర్ఎస్ ఎంపీల తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన రేవంత్ రెడ్డి Tue, Dec 07, 2021, 09:23 PM
రాచకొండ పోలీసులకు క్రీడాపోటీలు నిర్వహణ Tue, Dec 07, 2021, 09:17 PM
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీలు Tue, Dec 07, 2021, 04:40 PM