మహా ధర్నాలో పాల్గొన రాకేష్ టికాయత్

byసూర్య | Thu, Nov 25, 2021, 02:18 PM

సాగు చట్టాలు రద్దు అంశం పార్లమెంట్ లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో మహా ధర్నా సాగుతోంది. దిల్లీలో రైతు ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తైన సందర్భంగా ఇందిరాపార్కు వద్ద AIKSCC ఆధ్వర్యంలో మహాధర్నా ప్రారంభమైంది. ఈ ధర్నాకు SKM నేత రాకేష్  టికాయత్ , AIKS నేతలు అతుల్  కుమార్ అంజన్ , హన్నన్ మెల్లా, 'భూమి బచావో ఆందోళన్ నేత' జాగ్తర్ బజ్వా, ఆశిష్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రైతు నేతలకు ఘనస్వాగతం పలికిన రాష్ట్ర నాయకులు... సభా వేదికపైకి ఆహ్వానించారు. మహాధర్నాలో ఏఐకేఎస్ సీసీ రాష్ట్ర కమిటీ నేతలు పశ్య పద్మ, తీగల సాగర్, విస్సా కిరణ్ కుమార్, రాయల చంద్రశేఖర్, వేములపల్లి వెంకటరామయ్య పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పోడు రైతులు మహాధర్నాకు తరలివచ్చారు. సాగు చట్టాలు రద్దు ఆహ్వానిస్తూ.... విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ లో రద్దు చేసి ఆమోదించాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం ప్రవేశపెట్టాలని డిమాండ్  చేశారు. అలాగే, రాష్ట్రంలో పోడు భూములకు పట్టాల పంపిణీ, ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. 


 


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM