స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో రెండు ఏకగ్రీవాలు
 

by Suryaa Desk |

స్థానిక కోటా MLC ఎన్నికల్లో ఒక్కొక్కొటిగా అధికార తెరాస ఏకగ్రీవం చేసుకుంటోంది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఆరింటిన తెరాస ఖాతాలో వేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాలు తెరాస ఖాతాలోకి చేరాయి. పోటీకి దిగిన ఒకే ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్  ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది. వరంగల్ లోనూ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు  ఉపసంహరించుకున్నారు. వరంగల్ MLC స్థానంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నిన్న నిజామాబాద్  స్థానం నుంచి కవిత నామినేషన్  ఒక్కటే మిగలగా.. ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది.  రంగారెడ్డి జిల్లాలోనూ బరిలో ఎవరూ నిలవకపోవడంతో రెండు స్థానాలు తెరాస ఖాతాలోకి చేరాయి. శంభీపూర్  రాజు, పట్నం మహేందర్ రెడ్డి అభ్యర్థులిద్దరే పోటీలో నిలిచారు. వీరి ఎన్నికను రేపు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి బరిలో దిగిన తెరాస అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాత్రమే పోటీలో మిగిలారు. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM