తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్
 

by Suryaa Desk |

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిర్దారణ అనంతరం పోచారం మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఆరోగ్యాంగా ఉన్నానని ఎవరు బయపడొద్దని తెలిపారు.కాగా నవంబర్ 21న పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలు వివాహం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరుకాగా వారి పక్కనే కూర్చుని మాట్లాడారు స్పీకర్. సీఎంలతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఈ పెళ్లికి హాజరయ్యారు. తనకు పాజిటివ్‌ రావడంతో అందరూ టెస్ట్‌ చేసుకోవాలని, ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం కోరారు.


 


 


 


Latest News
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM
ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Wed, Dec 01, 2021, 07:33 PM
త్వరలో కమలం గూటికి మరో ఉద్యమకారుడు..? Wed, Dec 01, 2021, 07:18 PM
రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. సరిహద్దుల్లో నిఘా పెంపు Wed, Dec 01, 2021, 07:08 PM
అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్లి జైల్లో పెట్టారు.. ఇంకా ఇవ్వలేదు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ Wed, Dec 01, 2021, 07:02 PM