కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదు : మంత్రి ఎర్రబెల్లి
 

by Suryaa Desk |

వరి ధాన్యం కొనుగోలు పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.ఆ రెండు పార్టీల నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నరని అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి హన్మకొండలోని తన నివాసంలో మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... దేశంలో ఏ రాష్ట్రంలో నైనా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నయా?అని ప్రశ్నించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కొంటోందన్నారు.టీపీ సీసీ అధినేత రేవంత్ రెడ్డి ఫకీరు వేషాలు మానుకోవాలన్నారు. తొండి సంజయ్ మాటలకు విలువ లేదన్నారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని, సీఎం కేసీఆర్ కి కేంద్ర నాయకులు కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర మంత్రులు ధాన్యం కొనుగోలుపై స్పష్టతను ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతకైనా సిద్దంగా ఉందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM